నాలుగేళ్లు బీజేపీతో చంద్రబాబు చేసింది సంసారమా? వ్యభిచారమా?: విజయసాయి రెడ్డి

  • చంద్రబాబుకు విలువలు లేవు
  • ఆయనపై కోర్టు ధిక్కారం కేసు పెట్టాలి
  • పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో వైసీపీ నేత
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి విలువలు లేవని చెప్పడానికి నిన్న చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. గత నాలుగేళ్లుగా బీజేపీతో టీడీపీ చేసింది సంసారమా? లేక వ్యభిచారమా? అన్నది చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు ఓ వ్యభిచారా? అని ప్రశ్నించారు. డిసెంబర్ 31లోపు ఏపీలో హైకోర్టు భవనం నిర్మాణం పూర్తవుతుందని చంద్రబాబు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని గుర్తుచేశారు. ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ఈరోజు వైసీపీ నేతలతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

సాధారణంగా రాష్ట్రానికి హైకోర్టు వస్తుందంటే ఎవరైనా సంతోషిస్తారనీ, కానీ చంద్రబాబు మాత్రం ఇప్పుడు తెగ బాధపడుతున్నారని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం లేఖ రాస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. హైకోర్టు అఫిడవిట్ విషయంలో చంద్రబాబుపై కోర్టు ధిక్కార నేరం కింద కేసు పెట్టి జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఏపీలో చంద్రబాబు రూ.4 లక్షల కోట్లు దోచుకున్నారనీ, జగన్ ముఖ్యమంత్రి కాగానే ఈ మొత్తాన్ని కక్కిస్తామని హెచ్చరించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Chandrababu
KCR
YSRCP
Vijay Sai Reddy

More Telugu News